నెల్లూరు సిటీ ఎమ్మెల్యే తమ్ముడు అనిల్‌కుమార్ వ్యాఖ్యలు తనను బాధించాయని కోటంరెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్ కు నమ్మకద్రోహం చేసి ఉంటే.. తనను సర్వనాశనం చేయాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. తప్పు చేయకుండా ఉంటే దేవుడు తనకు అండగా ఉంటాడన్నారు. గతంలో అనిల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే తన కుటుంబం అల్లాడిందని కోటంరెడ్డి పేర్కొన్నారు. తన కుటుంబం.. అనిల్ కుటుంబం వేరని ఎప్పుడూ అనుకోలేదని కోటంరెడ్డి తెలిపారు.