కళాతపస్వి కె.విశ్వనాథ్ కు తూర్పుగోదావరి జిల్లాతో ఎనలేని అనుబంధం ఉంది. విశ్వనాథ్ కు ఎంతో గొప్ప ఘనకీర్తిని తెచ్చి పెట్టిన ‘‘శంకరాభరణం’’ సినిమా రాజమండ్రి లోనే చిత్రీకరించడం జరిగింది. అలాగే సిరిసిరిమువ్వ, స్వాతిముత్యం, సూత్రధారులు, ఆపద్భాందవుడు తదితర చిత్రాలను కూడా జిల్లాలోనే షూటింగ్ చేశారు. రాజమండ్రికి చెందిన అనేక మంది కళాకారులు, రచయితలతో విశ్వనాథ్‌ను అమితమైన అనుబంధం ఉంది. తూర్పుగోదావరి జిల్లా ను ప్రకృతి ప్రసాదించిన స్టూడియోగా అభివర్ణించిడం కె.విశ్వనాథ్‌కే చెందుతుంది.