వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ప్రకాశం జిల్లా, గిద్దలూరు టీడీపీ మండల అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి విమర్శించారు. మండలంలోని దిగువమెట్ట గ్రామంలో గురువారం రాత్రి ‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసున్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి మాట్లాడుతూ.... టీడీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి కృషితో గ్రామాల్లో సిమెంటు రోడ్లు, తాగునీటి సౌకర్యం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వంలో చిన్నపాటి అభివృద్ధి కూడా జరుగలేదని విమర్శించారు. రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రిగా చంద్రబాబును, ఎమ్మెల్యేగా అశోక్‌రెడ్డిని గెలిపించుకొంటేనే అభివృద్ది సాధ్యమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు లాల్‌నాయక్, రామకృష్ణనాయక్, వెంకటరావు, శ్రీనివాసనాయక్, యర్రబోయిన శ్రీను, పెద్దమస్తాన్, కొమ్మునూరు సర్పంచ్ రామసుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.