గంజాయి, మత్తు పదార్థాల అమ్మకాలు, అక్రమ రవాణా సమాచారం తెలియచేయాలని కృష్ణా జిల్లా, సూర్యారావు పేట సీఐ బీహెచ్ వెంకటేశ్వర్లు విద్యార్థులకు సూచించారు. సీతారాంపురం ఎన్ఆర్ఐ కాలేజీలో గురువారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... , గంజాయి లేదా ఏ విధమైన మాదక ద్రవ్యాలు అమ్ముతున్నా, అక్రమ రవాణా చేస్తున్నా పోలీసులకు తెలియచేయాలన్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని కాలేజీకి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. ఎస్ఐ వి. రంభ, ఎన్ఆర్ఐ కాలేజీ ప్రిన్సిపాల్ సతీష్ పాల్గొన్నారు.