కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు, మండలంలోని టీఎస్ కూళూరులో నరసింహారెడ్డి(65)అనే వృద్ధుడు గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్ళితే...... గ్రామానికి చెందిన నరసింహా రెడ్డి ఇంటి వద్ద మెట్లపై నుంచి కిందపడి గాయపడి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే గ్రామంలో మాత్రం మరోలా చర్చ జరుగుతోంది. నరసింహారెడ్డి అతని మూడో సోదరుడి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో తమ్ముడు అన్నపై దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమై మృతి చెందినట్లు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. రూరల్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.