ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని..మ్యాన్ ట్యాపింగ్ జరిగిందని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.....పార్టీ మారాలనే నిర్ణయం కోటంరెడ్డి వ్యక్తిగతం.. వైయస్ఆర్ సీపీపై బురద జల్లడం కోటంరెడ్డి మానుకోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఇన్ని రోజులు కోర్టుకు ఎందుకు వెళ్లలేదు.. ఆడియో రికార్డు అని కోటంరెడ్డికి తెలుసన్నారు . ఫోన్ రికార్డింగ్ అని తెలుసు కాబట్టే ఫోన్ ట్యాపింగ్ అని డ్రామాలు చేస్తున్నారు.. ఫోన్ ట్యాపింగ్ జరగలేదు మ్యాన్ ట్యాపింగ్ జరిగింది.. కోటంరెడ్డి ఈ స్థాయికి రావడానికి కారణం వైయస్ జగన్ కారణం కాదా?. కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని చెప్పావు ఏమైందని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు.