అబుదబీ నుంచి భారత్కు వస్తున్న ఓ ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం అబుదబీ నుంచి కాలికట్ బయల్దేరిన విమానం టేకాఫై వేయి అడుగుల ఎత్తులో ఉండగా ఒక ఇంజిన్లో సాంకేతిక సమస్య ఏర్పడి మంటలు చెలరేగాయి. దీన్ని గుర్తించి పైలట్ వెంటనే విమానాన్ని అబుదబీ విమానాశ్రయంలో ల్యాండ్ చేసినట్లు DGCA వెల్లడించింది. ఘటన సమయంలో విమానంలోని 184 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.