‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుంది. ప్రతిభ ఉండి గొప్ప గొప్ప యూనివర్సిటీల్లో సీట్లు సాధించి ఫీజులు కట్టలేక వెనకడుగు వేస్తున్న మన పిల్లలకు మనందరి ప్రభుత్వం అండగా నిలబడుతోంది. మన పిల్లలు బాగా చదువుకోవాలి.. ప్రపంచ వేదికపై మన ఆంధ్ర రాష్ట్ర జెండా ఎగురవేయాలి’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. విదేశాల్లో చదువుకునే మన పిల్లలకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని, చదువుకు పేదరికం అడ్డుకాకూడదని, పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి చదువే అని బలంగా నమ్ముతున్నానని చెప్పారు. అందుకే విద్యారంగంపై పెట్టుబడి పెడుతున్నామని చెప్పారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా గరిష్టంగా రూ.1.25 కోట్లను చెల్లిస్తున్నామని చెప్పారు. టాప్ 200 యూనివర్సిటీల్లో సీట్లు సాధించిన 213 మంది మన పిల్లలకు తొలి విడతగా రూ.19.95 కోట్ల సాయాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్ విడుదల చేశారు.