ఉదయం పూట అల్లం తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలుంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. టీ, కాఫీల్లో అల్లం తీసుకుంటే వికారం, మార్నింగ్ సిక్ నెస్ పోతుంది. అల్లం, పాలు, పసుపు కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని కూడా చెబుతారు. అల్పాహారంలో కాస్త అల్లం కలుపుకుంటే వాత, కీళ్ల నొప్పులు తగ్గుతాయని చెబుతున్నారు. అల్లం రసం తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుందని చెబుతారు.