శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రంలో శనివారం సచివాలయాల పరిధిలో గల "గృహ సారథుల శిక్షణా" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ స్టేట్ మహమ్మద్ ఇక్బాల్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గృహ సారథులు ప్రజలకు సచివాలయాలకు వారదులుగా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సచివాలయ సిబ్బంది, సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.