ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ నాయకుల విమర్శకు టీడీపీ నాయకుల ప్రతి విమర్శలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 04, 2023, 03:12 PM

నిత్యం ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు , నాయకులకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేస్తున్న సవితమ్మ ని విమర్శించేది మీరా అంటూ వైసిపి నాయకులపై పెనుకొండ తెలుగుదేశం పార్టీ నాయకులు ఫైరయ్యారు. శనివారం పెనుకొండ పట్టణంలోని సవితమ్మ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు మాధవనాయుడు, గుట్టూరు సూర్యనారాయణ తదితరులు మాట్లాడుతూ పెనుకొండ నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు, కార్యకర్తలకు, ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ వారికి భరోసా కల్పిస్తూ చేతనైనంత సహాయం చేస్తున్న సవితమ్మ ని మీరా విమర్శించేదన్నారు.


పిల్లికి కూడా బిక్షం వేయలేని స్వభావం మీ ఎమ్మెల్యేదన్నారు. మా తెలుగుదేశం పార్టీలో వెన్నుపోటు ఉందని అంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తలకు నాయకులకు ఒకరంటే ఒకరు పోటీపడి సహాయం చేస్తున్నారని , పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. చివరగా ఎవరు చేసిన పార్టీ కోసం కృషి చేస్తున్నారని, దాన్ని వెన్నుపోటు అంటారా అని ప్రశ్నించారు.


వెన్నుపోటు అంటే ఓట్లు వేసి గెలిపించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత వైసిపి కార్యకర్తలు మీద నాయకులు మీద కేసులు పెట్టించి జైలుకు పంపించిన చరిత్ర మీ పార్టీలో మీ నాయకుడిది, దాన్ని వెన్నుపోటు అంటారన్నారు. రైల్వే కాంట్రాక్టర్లపనుల్లో, కర్ణాటక డీజిల్ అక్రమ వ్యాపారం చేస్తోందని కోట్ల రూపాయలు ప్రజాధనం దోపిడీ చేసిందని మీరు మాట్లాడుతున్నారు మీకు చేతనైతే గత నాలుగు సంవత్సరాలుగా అధికారంలో మీ వైసీపీ ప్రభుత్వం ఉంది , మీకు చేతనైతే నిరూపించండి, అంతేకానీ లేనిపోని విమర్శలు చేసి నవ్వుల పాలు కాకండని తెలిపారు.


మీకు చేతనైతే సవితమ్మ వ్యాపారాలు మీద, మీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ బినామీ ఆస్తులపైన చర్చకు సిద్ధమని సవితమ్మ సవాల్ విసిరింది దానికి కట్టుబడి ఉంటారా మీ నాయకుడు అని తెలిపారు. మీకు కూడా సవితమ్మ ను విమర్శలు చేసే వారు కాదని శాసనసభ్యులు, వారి సోదరులు ఒత్తిడితో ప్రకటన చేస్తున్నారు, తప్ప, మీరు కూడా అతని చేతిలో కీలుబొమ్మలు కాకండి అంటూ వైసీపీ నాయకుల విమర్శకు టీడీపీ నాయకులు ప్రతి విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ఆంజనేయులు, మావ టూరు గోపాల్, కౌన్సిలర్ గీతా హనుమంతు, మారుతి బాబుల్ రెడ్డి వాసుదేవరెడ్డి, బాలాజీ నాయక్, వెంకటేష్ , శెట్టిపల్లి మంజు, పాపన్న పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com