రాయలసీమ రైతు ఉత్పత్తిదారు సంస్థల సమ్మేళనాన్ని అనంతపురం ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, జెడ్పి చైర్మన్ గిరిజమ్మ, జిల్లా అగ్రి అడ్వైజరి బోర్డు చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, ఏకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమ్మేళనానికి రాయలసీమ జిల్లాల్లోని 120 ప్రగతిశీల రైతు ఉత్పత్తి దారు సంస్థల నుంచి 200 మంది సన్న, చిన్నకారు రైతులతో పాటు ఏపీ ప్రభుత్వ వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యాన, ఆహార, పరిశ్రమల నుంచి ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రధానంగా రైతు ఉత్పత్తిదారు సంస్థల సుస్థిరతకు సలహాలు, సూచనలు అందజేశారు. అంతకుముందు రైతు ఉత్పత్తి దారులు తయారు చేసిన పలు ఆహార ఉత్పత్తులను వారు పరిశీలించారు.