నీకు దమ్ముందా.. నీలో సత్తా ఉందా.. నీలో విషయం ఉందా.. ఉంటే రా.. నంద్యాల నడిబొడ్డున నాలుగోతేదీ చూచుకుందాం అని భూమా అఖిలప్రియ.. ఎమ్మెల్యే శిల్పా రవికి సవాల్ విసిరారు.మరి నాలుగోతేదీ వచ్చింది. నంద్యాల వేడెక్కింది.. ఇద్దరూ ఎక్కడ కలుస్తారో.. ఏం జరుగుతుందోనని టెన్షన్‌తో నంద్యాల జనం వెయిటింగ్. మరి అఖిల ప్రియ సవాల్‌కు శిల్పా స్పందిస్తారా.. నంద్యాల నడిబొడ్డున డిబేట్ పెడతారా?
నంద్యాల నడిబొడ్డునే చూసుకుందాం.. డేట్ నువ్వు చెబుతావా.. నన్ను చెప్పమంటావా.. యాడికిరావాలో నువ్వు చెబుతావా నన్ను చెప్పమంటావా.. నీలో దమ్ముంటే నాలుగో తేదీ రా.. నీలో దమ్ముంటే.. నీలో సత్తా ఉంటే.. కాస్కో.. ఇదీ సీమ రెడ్డెమ్మ భూమా అఖిలప్రియ డైలాగ్.
భూమా.. ఈ పేరు రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓ సెన్సేషన్. ఫ్యాక్షన్ ప్రాంతాల్లో అదో వైబ్రేషన్. రాజకీయాల్లో అదో రెవల్యూషన్. ఇప్పుడాయన లేరు. ఆయన కూతురు భూమా అఖిలప్రియ నాయన తరపున రాజకీయాల్లో ఉన్నారు. 'మీ నాయన శిల్పా మోహన్ రెడ్డి కంటి కింద గాటు ఎలా పడిందో.. ఓసారి మీ నాయన్నే అడుగు చెబుతారు. భూమా ఫ్యామిలీ అంటే ఏంటో' అంటూ అఖిల చేసిన కామెంట్స్ పీక్స్‌లో పొలిటికల్ హీట్ పెంచాయి. వీరిద్దరి మాటలు విన్న జనం.. 'ఏందెబ్బా ఇది.. సీమ పౌరుషం శివ తాండవం జేస్తాంది అని అనుకుంటున్నారు.' మరి ఇక్కడ భూమా వారసత్వం.. అక్కడ శిల్పా నాయకత్వం.. నెగ్గేదెవరు..ఢీ కొట్టి నిలిచేదెవరు.
నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి.. ఓ సభలో పాల్గొన్న ఆయన భూమా కుటుంబంపై కామెంట్ చేశారు. ఇక్కడే అఖిల ప్రియకు ఆగ్రహం కలిగింది. మా కుటుంబాన్ని ఇంత మాటంటే.. ఎవరూరుకున్నా.. నేనూరుకోనని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అసలు నువ్వు ఎమ్మెల్యేవేనా అంటూ అటాక్ చేశారు. దీనికి స్పందించిన శిల్పా రవి.. ఈ మాటలకేంటి కానీ.. ముందు మీ బలమేంటో చూసుకోండని రివర్స్ కామెంట్ చేశారు.
'ఫ్యామిలీ గురించి నువ్వు మాట్లాడుతున్నావా.. మా బలం గురించి నువ్వు చెబుతున్నావా.. నీకు దమ్ముంటే.. అసలు నీలో విషయముంటే.. రా చూసుకుందాం..' అంటూ అఖిల ప్రియ ఈ మాట చెప్పేసరికి అదీ భూమా బిడ్డంటే అని ఆళ్లగడ్డ జనం చాలా చెప్పుకున్నారు. నాలుగో తేదీ ఎప్పుడెప్పుడొస్తుందా.. అని ఎదురుచూశారు. నాలుగోతేదీ రానే వచ్చింది. మరి అఖిల ప్రియ, శిల్పా రవి నంద్యాల నడిబొడ్డున డిబేట్ పెడతారా.. ఎవరి దమ్ము ఎంతో.. ఎవరి సత్తా ఏంటో చూపిస్తారా.. అని జనం కూడా వెయిటింగ్.