తమ దేశంలో వికీపీడియా సర్వీసులను పాకిస్తాన్ బ్లాక్ చేసింది. 'దైవ దూషణకు సంబంధించిన కంటెంట్లను తొలగించాలని లేదా బ్లాక్ చేయాలని వికీపీడియాను సంప్రదించాం. గతంలోనే ఫిర్యాదు చేశాం. స్పందించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించాం' అని పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ ఓ ప్రకటనలో తెలిపింది. తాము కోరినట్లుగా కంటెంట్ ను వికీపీడియా తొలగించలేదని, దీంతో సర్వీసులను బ్లాక్ చేసినట్లు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa