ఉత్తర్ ప్రదేశ్ లోని ఇద్దరు దొంగలు చోరీకి విచిత్రమైన ప్రయత్నం చేశారు. మీరట్ లో దీపక్ కుమార్కు చెందిన నగల దుకాణంలో దొంగతనానికి యత్నించారు. దుకాణంలోకి ప్రవేశించేందుకు షాపు సమీపంలోని నాలా నుంచి 15 అడుగుల పొడవు సొరంగం తవ్వారు. లోపలికి ప్రవేశించిన వారు షాపులోని నగలపెట్టెను తెరవడంలో విఫలమయ్యారు. వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్తోనూ పనికాలేదు. దీంతో వారు సారీ అంటూ ఓ చిట్టీపై రాసిపెట్టి వెళ్లిపోయారు.