శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లి మండలం, బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మండల టిఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి యు. మహేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడి, ఆసుపత్రి చికిత్స అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీ సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, పెనుకొండ అసెంబ్లీ ఇన్చార్జ్ బి కే పార్థసారథి తరపున ఆయన అల్లుడు శశిభూషన్ శనివారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి మండల కన్వీనర్ సిద్దలింగప్ప , మాజీ జడ్పిటిసి రామకృష్ణ, తెలుగు యువత అధికార ప్రతినిధి జావిద్, మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు సువర్ణమ్మ, క్రిష్ట, గోవిందు, మైలర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.