ఇటీవల కాలంలో ఆడవారు లిప్ స్టిక్ లేకుండా బయటికి రావడానికి ఇష్టపడటం లేదు. అయితే లిప్ స్టిక్ ను అతిగా వాడితే అనారోగ్యం తప్పదని నిపుణులు చెబుతున్నారు. లిప్‌స్టిక్‌లో క్రోమియం, మెగ్నీషియం, లెడ్, కాడ్మియం, పెట్రో కెమికల్స్‌ను వాడతారు. ఈ కెమికల్స్ శరీరంలోకి వెళ్తే కిడ్నీలు దెబ్బతింటాయి.కడుపులో కణితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇందులో కలిపే పెట్రో కెమికల్ వల్ల తెలివితేటలు మందగించే అవకాశం ఉంది.