పెద్దారవీడు మండల రాజంపల్లి గ్రామంలోని తిరుమల నాధ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం పరిశీలించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పాలిరెడ్డి కృష్ణారెడ్డి, జెడ్పిటిసి ఏరువ చలమారెడ్డి, ఎంపీపీ బెజవాడ పెద్ద గురవయ్య, ఆలయ చైర్మన్ దుద్దెల వెంకట రెడ్డి, ఆలయ ఈవో చెన్న కేశవ రెడ్డి, సర్పంచ్ లు చిన్నోడు, అవుయ్య యాదవ్ లు పాల్గొన్నారు.