మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో జరిగిన అవకతవకలు, ఆరోపణలపై విచారణ జరిపించాలని సూపర్డెంట్ కు సిపిఐ నాయకులు వినతి పత్రాన్ని శనివారం అందజేశారు. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ నందు కోటి ఇరవై లక్షల రూపాయలు అవినీతి జరిగిందని వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాలని సిపిఐ మదనపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సుపర్నెంట్ కి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు కృష్ణప్ప మాట్లాడుతూ.. ప్రభత్వ జిల్లా ఆసుపత్రి నందు కోటీ ఇరవై లక్షల రూపాయలు అవినీతి జరిగిందని, గత రెండు వారాల క్రితం సోషల్ మీడియాలో వార్తలు రావడం జరిగిందని, ఈ ఆరోపణలపైన విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలముందు పెట్టాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన ఇంతవరకు అధికారయంత్రాంగం ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు.
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబ శివ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లుగా విధులు నిర్వహిస్తూ ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నారని, అక్కడ వైద్యం చేసిన పేషెంట్లకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం క్రింద బిల్లులు పెట్టి కోట్ల రూపాయలు ప్రభుత్వ కజానాను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీలో వచ్చిన ఇన్సెంటివ్ డబ్బులలో కూడా గోల్ మాల్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఇందులో వాస్తవాలను తెల్చమని అడిగితే అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేమని అనుమానం వ్యక్తం చేశారు.
పట్టణ కార్యదర్శి కె మురళి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం పేషంట్లు వస్తే వారిని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు రెపర్ చేస్తున్నారని, స్కానింగ్ సెంటర్ యజమానులతో ప్రభుత్వ డాక్టర్లు మామూళ్లు తీసుకొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నవీన్, రెడ్డి, జయప్రకాష్, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.