ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని స్థానిక కోటా స్కూల్ ఆవరణలో అపోలో గ్రూప్స్ అధినేత డాక్టర్ ప్రతాప్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం గిద్దలూరు అపోలో ఫార్మసీ సిబ్బంది మొక్కలు నాటే కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా కోట స్కూల్ హెడ్మాస్టర్ సి. హెచ్ ఆవుల రాజు మాట్లాడుతూ. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ రక్షించాలని ఆయన తెలిపారు. ఈ విధంగా అపోలో ఫార్మసీ సిబ్బంది వారు తమ పాఠశాలకు మొక్కలు అందించడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అపోలో ఫార్మసీ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాసరెడ్డి, ఇన్చార్జి రంగారెడ్డి, నారాయణరెడ్డి, భాష, సయ్యద్ పీరా, రవీంద్ర స్వప్నకుమారి, చిన్నబాబు, కిషోర్ సంగీత, ఆపోలో ఫార్మసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.