ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి టోల్ ప్లాజా వద్ద శనివారం బేస్తవారిపేట ఎస్సై మాధవరావు ఆధ్వర్యంలో నో యాక్సిడెంట్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై ఎస్సై మాధవరావు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. మితిమీరిన వేగంతో వెళ్లి రోడ్డు ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని వాహనదారులకు హితవు పలికారు. మద్యం తాగి వాహనాలు నడిపితే భారీ జరిమానా తో పాటు జైలు శిక్ష కూడా పడుతుందని వాహనదారులను హెచ్చరించారు.