ఇపుడున్న పరిస్థితుల్లో టీడీపీ ఉన్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఉపయోగం లేదని వైఎస్సార్సీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. పూర్తి పగ్గాలు తీసుకొని ఐదేళ్ళ పాటు జగన్ లాగా ప్రజలతో జూనియర్ ఎన్టీఆర్ మమేకం అవ్వాలన్నారు. బీఆర్ఎస్ వచ్చినా వీఆర్ఎస్ కావడమేనని.. ప్రజాకర్షణ లేని వాళ్లే చంద్రబాబు లాగా పొత్తులు పెట్టుకుంటారన్నారు. లక్ష్మీపార్వతి క్యాన్సర్ డే సందర్భంగా ఒమేగా హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నాారు. జనరల్ చెకప్ కోసం వచ్చానని.. క్యాన్సర్ కి ఎవరూ భయపడవద్దన్నారు.
చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోనే వివేకా హత్య జరిగిందన్నారు లక్ష్మీపార్వతి. అప్పుడు పోలీసంతా చంద్రబాబు చేతిలోనే ఉన్నారని.. ఈ కేసును అప్పుడు సీబీఐకి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వివేకా హత్య కేసులు సీబీఐకి ఇచ్చారని.. దీన్ని బట్టి ఈ కేసులో వ్యవహారంలో ఎవరు సిన్సియర్‌గా ఉన్నారో అర్థం అయిపోతుందన్నారు. రాజకీయంగా ఇరికించే ప్రయత్నం చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. సీబీఐలోనూ చంద్రబాబు మనుషులున్నారన్నారు.