రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాకరంగా చేపడుతున్న జగనన్న కాలనీ గృహాలు మరింత వేగవంతం చేయాలని గృహ నిర్మాణ శాఖ ఏఈ శంకర్రావు కోరారు. శనివారం నరసన్నపేట మండలంలోని ఉర్లాం పంచాయతీలో హౌసింగ్ డే సందర్భంగా గృహ లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక గ్రామంలో 41 ఇల్లు మంజూరు అయ్యాయని అయితే ఇప్పటివరకు కేవలం 20 ఇళ్లు మాత్రమే పూర్తి అయ్యాయని వివరించారు. మిగిలిన వాటిని కూడా పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పోలాకి నరసింహమూర్తి, ఎంపిటిసి సభ్యురాలు నడిమింటి లక్ష్మీ శాంతారావు, గృహ నిర్మాణ శాఖ సిబ్బంది మరియు సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.