ఉపాధి హామీ పథకం కింద పనులు చేసే కూలీలను 100% పెంచాలని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ యదుభూషన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన సిద్ధవటంలోని బీసీ బాలుర వసతి గృహం ఆవరణంలో శనివారం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 16వ సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ యదు భూషణ్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధి కూలీల పేమెంట్ విషయంలో కంప్యూటర్ ఆపరేటర్లు సక్రమంగా నమోదు చేయాలన్నారు. ఏదైనా పొరపాట్లు చేస్తే సిద్ధవటం మండలమే కాదు, జిల్లా కూడా ప్రోగ్రెస్ లో వెనుకబడుతుందన్నారు.