వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంలో సీబీఐ విచారణను వైఎస్ఆర్సీపీ నాయకులు స్వాగతిస్తున్నారని డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, రాష్ట్రసోషల్వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్ పులి సునిల్ కుమార్, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఫ్ఘలాఖాన్ అన్నారు. శనివారం కడపలో వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ తదితరులు తామే సీబీఐ అనుకునే రీతిలో మాట్లాడుతున్నారన్నారు. అవినాష్ రెడ్డికి ఉన్న జనాదరణను చూసి ఓర్వలేక వారు ఆరోపణలు చేస్తున్నారన్నారు.