భారతదేశంలోనే ఎంతో ప్రఖ్యాతిగాంచిన రెండో అయోధ్యగా పేరుగాంచిన శ్రీ కోదండ రామాలయం ఎంతో ప్రసిద్ధి చెంది యుగాల చరిత్రకు మూల కారణమైన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం చరిత్రను ఎందరో మహానుభావులు, కవులు, కవయిత్రులు రామాలయ చరిత్రను రచనల ద్వారా తెలిపి శ్రీరామచంద్రుని భక్తులకు చేరవేయడం ఎంతో అదృష్టకరమని పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు పసుపులేటి శంకర్ తెలిపారు. శనివారం కోదండ రామాలయంలో హైదరాబాదుకు చెందినటువంటి కవయిత్రి స్రవంతి పోతన చరిత్రను పుస్తక రూపంలో రచించి వాటిని ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం కార్యదర్శి ముమ్మడి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతున్న సాహిత్య పీఠం సభ్యులు పాల్గొన్నారు.