చైనా యాప్‌లపై కేంద్రం కొరడా ఝులిపిస్తుంది. 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లపై అత్యవసర ప్రాతిపదికన నిషేధం విధించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. చైనాతో సంబంధాలున్న ఈ యాప్స్ ప్రజలను అప్పుల ఊబిలోకి దించడంతో పాటు గూఢచర్య సాధనాలుగా మారే ఆస్కారం కూడా ఉన్నందున కేంద్రం చర్యలు తీసుకుంటుంది.