మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పెదవడ్లపూడిలో లైన్ మేన్ ను సస్పెండ్ చేసినట్లు అమరావతి విద్యుత్ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ టీ. వీ. తులసీరామ్ తెలిపారు. పెదవడ్లపూడిలో లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న కె. వెంకట్రావు వినియోగదారుల నుండి విద్యుత్తు బిల్లుల చెల్లింపుల నిమిత్తం నగదు వసూలు చేసి సంస్థకు చెల్లించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సంస్థను మోసం చేసే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.