సీనియర్ ఐఎఏఎస్ అధికారి అనిల్‌కుమార్ సింఘాల్ గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్.పి.సిసోడియా స్థానంలో ప్రభుత్వం సింఘాల్‌ను నియమించింది. ఈమేరకు సింఘాల్ శనివారం ఉదయం గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే రాజ్‌భవన్‌లోని వివిధ శాఖల అధికారులతో ప్రాథమికంగా సమావేశం నిర్వహించారు. 1993 బ్యాచ్‌కు చెందిన సింఘాల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలకమైన శాఖల్లో బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్రంలో అత్యంత కీలకమైన డీఓఈటీ డైరెక్టర్‌గా వ్యవహరించారు. టీడీడీ ఈవోగా, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించడంతో పాటు విశాఖపట్నం, తూర్పుగోదావరి, మెదక్ జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేశారు. ఆయన పనిచేసిన అన్నిచోట్లా తనదైన ముద్ర వేశారు.