లోకేశ్ పాదయాత్రపై పాజిటివ్ న్యూస్ కంటే నెగెటివ్ వార్తలే ఎక్కువగా ఉన్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. నాయకత్వం అనేది స్వయంగా ప్రకాశించాలని, బలవంతంగా రుద్దుడు కార్యక్రమంతో నాయకత్వం అభివృద్ది చెందదని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. ఎక్కడైనా అంతిమ నిర్ణేతలు ప్రజలేనని, వారే తేల్చుతారని స్పష్టం చేశారు. లోకేశ్ పాదయాత్ర స్థానికంగా కూడా సంచలనాత్మక రీతిలో సాగుతున్నట్టు అనిపించడంలేదని అన్నారు.