రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో జరిగిన సీర్ల సమావేశంలో బాబా రామ్‌దేవ్ రెచ్చగొట్టే ప్రసంగంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కార్యక్రమంలో తన ప్రసంగం ద్వారా మతపరమైన భావాలను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ యోగా గురువుపై కేసు నమోదైంది. స్థానిక నివాసి పథాయ్ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చౌహతాన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.బర్మార్ ప్రాంతంలో రాందేవ్, ముస్లింలు విద్వేషం వ్యాప్తి చేస్తున్నారని చెప్తూనే హిందూయిజాన్ని ఇస్లాం, క్రైస్తవంతో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.