ఏపీ ప్రభుత్వం ప్రజలకు తీపికబురు చెప్పింది. హౌస్ హోల్ట్ మ్యాపింగ్ లో కుటుంబ విభజనకు సంబంధించి ఆధార్ కార్డు, పాస్ పోర్టు, ఫ్యామిలీ సర్టిఫికెట్, ఆరోగ్య శ్రీ కార్డు, బియ్యం కార్డు, పెళ్లి పత్రికల్లో ఏ ఒక్కటి ఉన్నా అనుమతిస్తున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రకటించింది. దీనిపై ఎక్కడైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే సమస్య పరిష్కరిస్తామని తెలిపింది. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించింది.