ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీబీఐకి లేఖ రాశారు. ఇటీవల కొత్త సెక్రటేరియట్ లో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ చేపట్టాలని కేఏ పాల్ కోరారు. సెక్రటేరియట్ లోకి మీడియాను అనుమతించకపోవడంపై అనుమానాలున్నాయన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో చెలరేగిన మంటలు, ఆరో ఫ్లోర్ కు ఎలా చేరాయని ప్రశ్నించారు. ప్రమాదం భారీ స్థాయిలో జరిగిందని, సెక్రటేరియట్ లో ఏం జరుగుతుందో దర్యాప్తు చేయాలని కోరారు.