అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ సూచీలు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 205 పాయింట్ల నష్టంతో 60,635 వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు నష్టపోయి 17,785 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.46 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో ITC, యాక్సిస్, SBI, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.