హిందూపురం పట్టణంలోని శిల్క్ రీటింగ్ కాలనీ సూగూరు సడ్లపల్లిలో నెలకొన్న గ్రామ దేవత శ్రీ దుర్గాదేవి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుఘాము నుం చే ఆలయంలో మూల విరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ రకాల పూలు నగలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అదే విధంగా సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహంను పల్లకిలో అధిరోహించి పురవీధుల్లో ఊరేగించారు. కార్య క్రమంలో వెంకటేష్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు హాజరయ్యారు.