శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలంలోని రాచపల్లిలో శనివారం రాత్రి గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 30 గెర్రెలు మృతి చెందాయి. రాచపల్లికి చెందిన రైతు నంజిరెడ్డి గ్రామ సమీపంలో గొర్రెల రప్పం ఏర్పాటుచేసుకున్నాడు. అక్కడ రాత్రి పూట రప్పంలో తోలుకున్నాడు. అయితే ఆదివారం రాత్రి గ్రామంలోని ఊర కుక్కలు వ సూకుమ్మడిగా రప్పంలోకి చొరబడి గొర్రెలను కొరికి చంపేశాయి. ఈ దాడిలో 30 గొర్రెలు మృతి చెందగా, మరో 10 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. సుమారు రూ. 4 లక్షలు నష్టం వాటిళ్లినట్లు రైతు నంజిరెడ్డి వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.