సీపీఎస్, జీపీఎస్ లు కాదు ఓపీఎస్ని తక్షణమే అమలుచేయాలని యుటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో సంకల్ప దీక్ష చేపట్టారు. దీనికి యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జయచంద్రరెడ్డి హాజరై మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పారో, మడమ తిప్పారో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. ఏదైతే జీపీఎస్ అంటున్నారో దానిలోని మర్మమేమిటో చెప్పకుండా, సమావేశాలు నిర్వహించకుండా చేస్తే మేము ఎలా ఎప్పుకుంటామన్నారు. ఓపీఎస్ అమలుచేసే వరకు ఉద్యమాలు ఆగవన్నారు. ఈ దీక్షలో ఆయనతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, గౌరవాధ్యక్షులు బూతప్ప, సీతామహాలక్ష్మి, సుధాకర్, హరికృష్ణ, మారుతీ శ్రీనివాసులు, ఎంజీఓ తాలూకా అధ్యక్షులు నరసింహులు, శ్రీ శ్రీనివాసరెడ్డి, నరేష్ తదితరలు పాల్గొన్నారు.