ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడుపునొప్పి తాళలేక ఓ వివాహిత బలవన్మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 06, 2023, 01:46 PM

అనంతపురం జిల్లా రాయదుర్గం రూరల్ పరిధిలో కడుపునొప్పి తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాయదుర్గంలోని పై తోట ప్రాంతానికి చెందిన సిద్ద లింగకు మూడేళ్ల క్రితం కర్ణాటకలోని మొలకలమూరు తాలూకా ఎద్దుల బొమ్మయ్య దొడ్డికి చెందిన అంబికతో వివాహమైంది. పెళ్లయి మూడేళ్లయిన సంతానం కలగకపోవడంతో కుటుంబ సభ్యులు చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం కడుపునొప్పి భరించలేక అంబిక క్రిమిసంహారకమందు తాగిందన్నారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే మొలకలమూరులోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి తల్లి మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ రఘుబాబు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com