హిందూపురం పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ కు ఆదివారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాబావలి మాట్లాడుతూ హిందూపురం పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కళాశాలకు అధికారులు చర్లపల్లి వద్ద 9 ఎకరాల 44 సెంట్లు స్థలాన్ని కళాశాల కోసం కేటాయించడం జరిగింది. ఇప్పటివరకు అధికారులు నిర్లక్ష్యం మూలంగా ఈ కళాశాల ఏర్పాటుకు కృషి జరగలేదన్నారు. ఎమ్మెల్సీ స్పందిస్తూ ఉన్నత అధికారులతో మాట్లాడి కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.