ఇంట్లో పెరుగు తోడు లేకపోతే మనం పక్కింటివాళ్లను అడగడం మనకు తెలిసిందే. అయితే చిన్న చిట్కాతో ఎవరింటికి వెళ్లకుండా.. ఎవరి సాయం అవసరం లేకుండా మీ ఇంట్లో మీరే సొంతంగా పెరుగు తయారు చేసుకోవచ్చు. తోడు లేకపోతే పాలను గోరువెచ్చగా చేసి అందులో రెండు పచ్చిమిర్చి వేసి మూత పెట్టాలి. 12 గంటలు అస్సలు కదపకుండా పక్కన పెట్టాలి. తర్వాత మూత తీసి చూస్తే మీ కోసం మంచి గడ్డపెరుగు రెడీగా ఉంటుంది.