నూలివీడు పంచాయతీ ఆవులరెడ్డిగారిపల్లె వాసి వెంకట్రమణారెడ్డి (60) విషద్రావణం తాగి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. వెంకట్రమణారెడ్డి కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉండేవాడు. గతంలో రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసుకోగా అప్పుడు స్థానికులు రక్షించారని, ఆదివారం ఉదయం మరోసారి విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. విషద్రా వణం తాగిన వెంకట్రమణారెడ్డిని స్థానికులు బంధువుల కు తెలిపి చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకుని వెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. జరిగిన సంఘటనపై కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.