జాతీయ క్రీడాకారిణిగా, పర్వతారోహకురాలిగా పరిచయం ఉన్న ఆశా మాలవ్య సైకిల్‌పై దేశాన్ని చుట్టిరావాలన్న లక్ష్యంతో ప్రయాణిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లా నతారామ్ గ్రామానికి చెందిన మాలవ్య వివిధ రాష్ట్రాల్లో సైకిల్ పర్యటన చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చారు. ఆదివారం ఆమె గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆమెను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. ఆమె గవర్నర్‌తో మాట్లాడుతూ... ‘‘సైకిల్‌పై దేశంలోని 28 రాష్ట్రాల్లో 25,000 కిలోమీటర్లు తిరగాలన్నది నా లక్ష్యం. ఏపీతో సహా 8 రాష్ట్రాల్లో 8,555 కిలోమీటర్ల ప్రయాణం పూర్తయింది. మహిళా భద్రత, సాధికారత నినాదాన్ని సమాజంలోకి తీసుకువెళ్లే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నా’’ అని వివరించారు. ఉన్నతమైన నినాదాన్ని దేశవ్యాప్తంగా పరిచయం చేస్తున్న మాలవ్య అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, సంయుక్త కార్యదర్శి సూర్యప్రకాశ్ ఉప కార్యదర్శి నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.