విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలంలో రెల్లివలస నుంచి కుమిలి వెళ్లే మార్గంలో రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదంలో కుర్ని వెంకటేష్(16), గేదెల పైడి రాముడు(25) అనే ఇద్దరు యువకులు మృతిచెందారు. మృతిచెందిన ఇద్దరూ కుమిలి గ్రామానికి చెందినవారే. వివరాల్లోకి వెళ్ళితే.... వెంకటేష్ ద్విచక్ర వాహనంపై రెల్లివలస నుంచి కుమిలి గ్రామానికి వస్తున్నాడు. అదే సమయంలో పైడి రాముడు తన ద్విచక్ర వాహనంపై కుమిలి నుంచి రెల్లివలస వెళ్తున్నాడు. ఇద్దరూ అతివేగంతో ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టుకోవటంతో ప్రమాదం సంభవించింది. వెంకటేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. రాముడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. స్థానిక పోలీసులు కేసును నమోదుచేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. వెంకటేష్ తల్లిదండ్రులు రాములమ్మ, రాజినాయుడు, రాముడి తల్లిదండ్రులు అసిరమ్మ, రాజినాయుడు రోధిస్తున్నారు.