ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైడ్రో పవర్‌ ప్రాజెక్టుపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 06, 2023, 08:43 PM

పోలవరం చుట్టూ అనేక వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే పోలవరం నిర్మాణంలో భాగంగా నిర్మించనున్న హైడ్రో పవర్‌ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. రూ. 5,338 కోట్ల వ్యయంతో చేపట్టిన 960 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2026 జనవరి నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఏపీ జెన్‌కో ఉందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. ఈ మేరకు రాజ్యసభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అడిగిన ప్రశ్నకు గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్‌కో) ఆధ్వర్యంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలిపారు.


ఏపీ జెన్‌కో ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రాజెక్టు పవర్ హౌస్ పునాది నిర్మాణం కోసం తవ్వకాల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని.. ఈ ప్రాజెక్ట్‌ పూర్తిగా ఏపీ ప్రభుత్వం సొంత నిధులతోనే అమలు చేస్తారని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం నిధులేమీ కేటాయించడం లేదని షెకావత్ వెల్లడించారు.


మరోవైపు, పోలవరం ప్రాజెక్టును 2024 మార్చి కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు వెల్లడించారు. దీని కోసం జూన్ 2024 కల్లా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అయితే, గోదావరి నదికి ఇటీవల వచ్చిన వరదల కారణంగా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు. తెలుగు దేశం పార్టీ ఎంపీ పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com