కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీకి జ్వరం, ఛాతిలో ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించడంతో సోమవారం సాయంత్రం తిరువనంతపురం సమీపంలోని నెయ్యట్టింకరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.79 ఏళ్ల ప్రముఖ రాజకీయ నాయకుడు తన కుటుంబం సరైన చికిత్స అందించడం లేదని ఆరోపణల మధ్య న్యుమోనియా చికిత్స కోసం నెయ్యట్టింకరలోని నిమ్స్ ఆసుపత్రిలో చేరారు.ఈమేరకు సోమవారం ఉమెన్ చాందీని చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించనున్నట్లు యూడీఎఫ్ కన్వీనర్ ఎంఎం హసన్ తెలిపారు.