తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి గవర రాష్ట్ర కన్వినర్ మళ్ళ సురేంద్ర చేతుల మీదుగా శ్రీ నల్లమరమ్మ జాతర మహోత్సవం పోస్టర్ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా మళ్ళ సురేంద్ర మాట్లాడుతూ ఈనెల 7 న మండలంలోని రామాపురంలో జరిగే నల్లమరమ్మ పండుగను ఎటువంటి ఆటంకాలు లేకుండా అందర్నీ విజయవంతం జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలోమాజీ ఎంపీటీసీ కోన శ్రీను, ఉత్సవ కమిటీ సభ్యులు పెంట కృష్ణ, జ్యోతుల గణేష్, చక్కారాంబాబు, ఐత రాము, కొవ్వాడ వాసు, పూడి సతీష్ తదితరులు పాల్గొన్నారు.