రైతుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన స్కీమ్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద ఇప్పటికే 12 విడతల డబ్బులు జమ కాగా.. త్వరలోనే 13వ విడత పైసలు అన్నదాత ఖాతాల్లో పడనున్నాయి. దీనికి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని రైతులకు కేంద్రం సూచించింది. ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్నవారికి హోళీ పండగకు ముందే డబ్బులు జమ చేయనున్నట్లు సమాచారం. మరీ ఆ లిస్ట్ లో మీరు ఉన్నారా? ఈ వెబ్ సైట్ https://pmkisan.gov.in/ ద్వారా చెక్ చేసుకోండి.