టెక్కలి, పట్టణంలోని ఇందిరాగాంధి కూడలి నుండి పాత జాతీయ రహదారి, సుదర్శన్ ధియేటర్ నుండి చిన్న బజారుకు వెళ్ళే మార్గాలు మొత్తం మట్టి రాళ్లతో నిండిపోయాయి. గత రెండు రోజులుగా సంతోషిమాత గుడి దగ్గర కాలువ కల్వర్టు పనులు జరగడంతో దాని నుంచి తీసే పూడికను ఈ రోడ్ మీదుగా తీసుకునివెళ్లి డంపింగ్ చేస్తుండటంతో పాటు ట్రాఫిక్ కూడా ఈ రహదారి మీదుగానే మల్లించడంతో మట్టి, రాళ్లు రోడ్డుపై పడడంతో వాహనాదరులు, పాదచారులు దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే రోడ్డు మొత్తాన్ని శుభ్రం చేయాలని ప్రజలు కోరుకుంటుంటున్నారు.