మహారాష్ట్ర కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే తీరును నిరసిస్తూ సీఎల్పీ నేత బాలా సాహెబ్ థోరట్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ పంపారు. నానా పటోలే తనను అవమానాలకు గురి చేస్తున్నారని, తాను బీజేపీలో చేరబోతున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని థోరట్ ఆరోపించారు. అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నట్టు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa