బంగారాన్ని ఇష్టపడే చాలా మందికి అసలైన బంగారం, నకిలీ బంగారం మధ్య తేడాను తెలియదు. దీని వల్ల కొంతమంది మోసాలకు గురవుతుంటారు. అయితే నీటితో పరీక్షించి నిజమైన బంగారమేదో నిమిషాల్లో గుర్తించవచ్చు. బంగారం చాలా దృఢంగా, బరువుగా ఉండే లోహం. అందుకే నీటితో పరీక్షించవచ్చు. బంగారాన్ని నీళ్లు ఉన్న బకెట్ లో వేస్తే తప్పకుండా మునిగిపోతుంది. ఒకవేళ మునగకపోతే అది కచ్చితంగా నకిలీ బంగారం అని గుర్తుంచుకోవాలి.